కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పోస్టులకు పాల్పడిన వారిపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదు కేసులను నమోదు చేశారని ఇందులో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కరోనా వ్యాధి సోకినట్లుగా స్థానిక గ్రూప్ ల్లో పోస్ట్ చేయడం, వ్యక్తుల ఫోటోలను వినియోగించుకొని కరోనా వ్యాధికి గురైన వ్యక్తి అతని గ్రామం పేరును ప్రస్తావిస్తూ వాట్సప్ పోస్టులు చేయడంతో పాటు, టీవి ఛానెల్స్ లో తప్పుగా ప్రసారం చేయడం.

ముఖ్యంగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు భయభ్రాంతులకు గురైయ్యే విధంగా వెబ్ ఛానెల్స్ తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం, అధే విధంగా ఎలాంటి సంఘటన జరగకున్న తప్పుడు వీడియో దృశ్యాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసినవారిపై కేసులు నమోదు చేయబడ్డాయని. అదే విధంగా కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పోస్టు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై వివిధ చట్టాల క్రింద కేసులను నమోదు చేయబడుతుందని వరంగల్ పోలీస్ కమీషనర్ డా.వి.రవీందర్ వెల్లడించారు.