ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో అవసరమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ పై సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని అన్నారు.