హైదరాబాద్: స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఘన విజయం సాధించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్‌ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర చీఫ్ కమీషనర్ గా విజయం సాధించారని రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.