చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు తన స్టూడెంట్‌తో రాసలీలలు నడిపి సభ్య సమాజం తలలదించుకునే పని చేసింది. వివరాల్లోకి వెళితే కేరళలోని అలెప్పీ ప్రాంతానికి చెందిన ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళ, తన భర్త అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కలిసి నివాసం ఉంటోంది. అయితే ఆ టీచర్ భర్త పెళ్లైన వారానికే ఆఫీస్ పనిమీద ఉద్యోగం పనిమీద చెన్నై వెళ్లిపోయాడు. అయితే కొన్నాళ్ల తర్వాత వచ్చి భార్యను తీసుకెళ్తానని చెప్పాడు.

అయితే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో, అక్కడ పరిచయమైన ఓ 17 ఏళ్ల యువకుడితో ఆమెకు బాగా చనువు ఏర్పడింది. చనువు కాస్త శారీరక సంబంధంగా మారి ఇద్దరూ పలుమార్లు శృంగారంలో పాల్గొనట్టు తేలింది. పెళ్లి కుదరిన తర్వాత లేచిపోదామని అనుకున్నా అప్పుడు అందరికీ అనుమానం వస్తుందనే ఉద్దేశంతో కొన్నాళ్లు ఆగి పక్కా ప్లానింగ్‌లో పరారయ్యినట్టు తేలింది. దాదాపు రెండు నెలల పాటు ఇద్దరూ వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ విపరీతంగా ఎంజాయ్ చేసిన ఈ ఇద్దరూ పోలీసుల కంటపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్ మైనర్ కావడంతో టీచర్‌పై కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు పోలీసులు.