యువతి స్నానం చేస్తుండగా యువకుడు వీడియో తీసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

కొందరు యువతులు రూమ్ అద్దెకు తీసుకొని బంజారాహిల్స్‌లో ఉంటున్నారు. వాళ్ల రూమ్ పక్కనే యూసుఫ్ ఫరూక్ (19) కుటుంబం ఉంటుంది. ఓ యువతి స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఫరూక్ వీడియో తీశాడు. అది గమనించిన యువతి 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు నాలుగు నిమిషాల్లో అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని వద్ద ఫోన్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.