భార్య పరాయి పురుషుడితో శృంగారంలో పాల్గొంటున్న వీడియో ఓ అశ్లీల వెబ్ సైటులో చూసిన భర్త షాక్ గురైన వివరాలు భూషణ్ ( పేరు మార్పు) తన భార్య సిమ్రన్ (పేరు మార్పు)తో కలిసి నగరంలో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తమ ఇంటి సమీపంలో సునీల్ అనే వ్యక్తి తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. అలా వారి కుటుంబంతో సునీల్ పరిచయం పెంచుకున్నాడు. భూషణ్ సైతం సునీల్ ను తన స్నేహితుడిగానే చూశాడు. ఈ నేపథ్యంలో సునీల్ కన్ను భూషణ్ భార్యపై పడింది.

ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. భూషణ్ ఇంట్లో లేని సమయంలో తరచూ ఆమెను కలిసేందుకు వచ్చేవాడు. ఏదో ఒక వంకతో ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నం చేసేవాడు. అవసరం లేకపోయినా ఖరీదైన బహుమతులు, నగదు సహాయం చేసేవాడు. దీంతో ఆమె అతడికి ఆకర్షితురాలైంది. క్రమక్రమంగా వారి బంధం వివాహేతర బంధంగా మారింది. డబ్బు మోజులో పడి సిమ్రాన్ దాంపత్య బంధాన్ని మంటగలిపింది.

ఈ నేపథ్యంలోనే సునీల్ ఆమెకు డబ్బు పట్ల ఉన్న ఆశ చూసి తన ప్లాన్ అమలు చేశాడు. ఇద్దరం కలిసి అశ్లీల వీడియోల్లో నటిస్తే బోలెడంత డబ్బు వస్తుందని నమ్మించాడు. ముందు సిమ్రాన్ భయపడినప్పటికీ, సుఖాల మోజులో ఒప్పుకుంది. దీంతో ఇద్దరూ కలిసి చేసిన అశ్లీల వీడియోలు చేయడం ప్రారంభించారు. కాగా కొంతకాలం తర్వాత ఒకరోజు భూషణ్, తన భార్య ఫోన్ ఓపెన్ చేసి చూశాడు.

అందులో ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశాడు. చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తన భార్యతో కలిసి మరో వ్యక్తి శృంగారం చేస్తున్న వీడియో చూసి అవాక్కయ్యాడు. వెంటనే భార్యను నిలదీయగా అసలు విషయం బయటపడింది. స్నేహం రూపంలో సునీల్ చేసిన ద్రోహం తెలుసుకొని, వెంటనే భూషణ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.