నిన్నటి దాకా వ్యభిచారం గృహాల్లో, లగ్జరీ హోటళ్లు, లాడ్జిల్లో సాగిన ఈ సెక్స్ రాకెట్ దందా! ఆన్ లైన వైపు తిరిగింది. ఎవరికీ అనుమానం రాకుండా స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న మూఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇక వివరాలలోకి వెళితే, ముంబైలో రజ్నేష్ వెల్‌నెస్ లిమిటెడ్ పేరుతో రజ్నేష్ సింగ్ (35) స్పా సెంటర్ పెట్టి వెనకాల నుంచి వ్యభిచారం నడిపిస్తున్నాడు. అతడి వద్ద ఐదుగురు యువతులు ఉంటారు. ఇంటి వద్దకే స్పా సర్వీస్ అని చెప్పి ప్రకటన ఇచ్చాడు. అయితే, అనుమానం వచ్చిన పోలీసులు ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేసి తాను కస్టమర్‌ను అంటూ వివరాలు ఆరా తీశారు. పక్కా ప్రణాళికతో అంథేరీలోని ఓ హోటల్‌కు ముగ్గురు యువతులను పంపాలని కోరాడు. నిజంగా కస్టమర్ కావచ్చని యువతులను సంబంధిత అడ్రస్‌కు వారిని పంపాడు. ఆ యువతులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు మిగతా ఇద్దరు యువతులు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.4.70లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు…