హుజూర్నగర్ నుండి ఇబ్రహీంపట్నం ద్విచక్రవాహనంపై వెళుతున్న షేక్ ఖాసిం, మోతి దంపతులు చెరువు కట్ట వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ గుర్తించక వేగంగా దాటే క్రమంలో బైక్ పై నుండి మోతి జారిపడ్డగా తలకు రక్త గాయం అయింది అటుగా వెళ్తున్న శక్తి టీం సభ్యులు కుమారి మరియు పద్మ మహిళను కాపాడి ఆటోలో కంచికచర్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సహాయం కోసం విజయవాడ తరలించారు

రహదారి విస్తరణ పనులలో భాగంగా వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ కారణంగా ఇప్పటికే అనేక ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురి అయ్యాయి జాతీయ రహదారిపై ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదని రవాణా శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ స్పీడ్ బ్రేకర్ అలాగే ఉంచారు