బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విడుదలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా IAS ఆఫీసర్, తెలంగాణ CMO కార్యదర్శి స్మిత సబర్వాల్ స్పందించారు. ‘ఆ వార్తలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఓ మహిళగా, సివిల్ సర్వెంట్గా స్వేచ్ఛాయుత దేశంలో ఉన్నామనే నమ్మకం కలగట్లేదు. బాధితురాలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే హక్కును మళ్లీ దూరం చేసినట్టయింది. జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో’ అని ఆమె ట్వీట్ చేశారు.