బాలీవుడ్ హీరోయిన్స్‌లో కరిష్మా కపూర్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 90ల్లో ఈమె సినిమాలకు అదిరిపోయే క్రేజ్ ఉండేది. అప్పుడెప్పుడో ప్రేమఖైదీ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన కరిష్మా ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. గోవిందాతో కరిష్మా జోడీ బ్లాక్‌బస్టర్. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయిపోయింది కరిష్మా కపూర్. ఇప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల గురించి మీడియా ముందు ఓపెన్ అయిపోయింది ఈ భామ. ముఖ్యంగా తన వివాహం జరిగిన విధానం ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అప్పటి వరకు ఉన్న తన జీవితం తిరగబడిన తీరు అన్నీ చెప్పుకొచ్చింది కరీనా సిస్టర్. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు పెళ్లి చేసుకోవడమే అని, ఎందుకంటే పెళ్లి తర్వాత ప్రతిరోజూ బాధ పడుతూనే ఉన్నానని చెప్పింది కరిష్మా కపూర్. అందరి జీవితంలో హనీమూన్ అనేది మధుర ఘట్టం అయితే తన జీవితంలో మాత్రం అదో చెత్త జ్ఞాపకాలలో ఒకటి అంటుంది కరిష్మా. అప్పుడు అన్ని బాధలు భరించానని చెప్పుకొచ్చింది ఈమె. పెళ్లైన వెంటనే తనను సంజయ్ కపూర్ తనను హింసించడం మొదలు పెట్టాడని మరీ ముఖ్యంగా స్నేహితులలో తనను పడుకోమని బెదిరించేవాడని, మానసికంగా, శారీరకంగా హింసించేవాడని సంచలన ఆరోపణలు చేసింది కరిష్మా. అందుకు తాను నిరాకరించడంతో కొట్టాడని సంజయ్‌పై ఆరోపించింది కరిష్మా.

హనీమూన్‌లో తనను వేలం వేసి తన స్నేహితులకు ధరను కోట్ చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది కరిష్మా కపూర్. అలాంటి నరకం పదేళ్లకు పైగానే చూసానని చెప్పింది ఈమె. తనతో వివాహం అయిన తర్వాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో శారీరక సంబంధం కొనసాగించాడని చెప్పింది కరిష్మా కపూర్. ఎదురు తిరిగితే తనపై దాడి కూడా చేసాడని చెప్పింది. సంజయ్ మాత్రమే కాదు, అతడి తల్లి కూడా చాలా సార్లు తనపై దాడి చేసిందని కరిష్మా చెప్పింది. తాను గర్భంతో ఉన్నపుడు అత్తయ్య ఇచ్చిన దుస్తులు ధరించకపోవడంతో తీవ్రంగా దాడి చేశారని కరిష్మా చెప్పింది. ఎన్నో ఏళ్ల కష్టాల తర్వాత సంజయ్ నుంచి విడిపోయింది కరిష్మా. 2003లో వీళ్ల పెళ్లి జరగ్గ 2016లో విడాకులు తీసుకున్నారు. కరిష్మాకు ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు తల్లి దగ్గరే ఉంటున్నారు. కరిష్మాతో విడిపోయిన తర్వాత ప్రియా సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్నాడు సంజయ్ కపూర్.