{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584282743795","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584282723708","source":"other","origin":"unknown"}

హనీమూన్‌కు ‘మేము వెళ్లింది ఇటలీ కాదు, నెదర్లాండ్‌కు’ అని నటుడు తెలిపారు. తాము హనీమూన్‌కు ఇటలీ వెళ్లినట్లు అబద్ధపు వార్తలు సృష్టించారని ఆయన శనివారం తెలిపారు. కాగా, ఇటీవల, చందన్‌ శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లారు. అయితే నూతన వధూవరులు ఇటలీకి హనీమూన్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపించాయి.

ఈ జంట వెళ్లిన తరువాత కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో, తమ ఆనందాన్ని పక్కన పెట్టి, ప్రయాణాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి ఇండియాకు బయలుదేరారు. ఈ వార్త తెలియగానే, మైసూరులో పలు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ను కలిసిన పలువురు, ఇంతవరకూ మైసూరులో కరోనా లేదని, వారిద్దరినీ నగరంలోకి వెంటనే అనుమతించ వద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు సామ్యనులకు ఎలా ట్రీట్ మెంట్ ఇస్తున్నారో, 14 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి, ఆపై మాత్రమే వారిని అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరోనా భారిన సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇబ్బందులు పడుతుంది.

ఈ నేపథ్యంలో మండ్యలో వారిరువురు మీడియాతో మాట్లాడుతూ: ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి వెళ్లిన విషయం అధికారుల వద్ద ఉందని చెప్పారు. తాము ఈ నెల 3న నెదర్లాండ్స్‌కు వెళ్లినట్లు, అప్పుడు అక్కడ కరోనా వైరస్‌ భయం లేదని తెలిపారు. ప్రస్తుతం తామిరువురం ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. రక్తపరీక్షలతో పాటు అన్ని వైద్య పరీక్షలు చేశారని తెలిపారు. కరోనా వెళ్లిపోయాక మళ్లీ హనీమూన్‌కు వెళ్తామని చెప్పారు.