వృద్ధాప్యంలో తల్లికి అండగా నిలువాల్సిన కొడుకు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టాడు చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ముందుకురాలేడు. దీంతో ఆశ్రమ నిర్వాహకులే తలకొరివి పెట్టి మానవత్వం చాటుకున్నారు.

హన్మకొండలోని రెడ్డికాలనీకి చెందిన గూడూరు శ్యామలమ్మ (72)కు కుమారుడు గూడూరు వెంకటేశ్వర్లు ఉన్నాడు. ఇతడు ఆర్టీసీలో క్లర్క్. తల్లిని పోషించకపోగా చిత్రహింసలకు గురిచేయడంతో స్థ్ధానికుల సమాచారం మేరకు గత జూన్ 24న స్థానిక సహృదయ అనాథ వృద్ధ్దాశ్రమ నిర్వాహకులు మహ్మద్ యాకూబీ స్పందించి శ్యామలమ్మను తమ ఆశ్రయానికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామలమ్మ బుధవారం మృతిచెందారు.

ఈ విషయం ఆమె కుమారుడు వెంకటేశ్వర్లుకు చెప్పినా రాలేదు. యాకూబీ అన్నితానై హన్మకొండలోని శివముక్తి ధాంలో హిందూ సంప్రదాయ ప్రకారం తలకొరివిపెట్టింది.