👉🏼 చరిత్రాత్మక నగరం, కాకతీయుల కళావైభవం వరంగల్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ..

👉🏼 బతుకమ్మ పండుగ కు హజరైన
రాష్ట్ర మంత్రులు పంచాయితి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ,క్రీడాలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,ప్రభుత్వ చిప్ విప్ వినయ్ బాస్కర్, ప్రజాప్రతినిధులు…హాజరైయ్యారు.

👉🏼మంత్రులకు ఘనస్వాగతం పలికిన ఒగ్గు, డప్పు కళాకారులు..పెద్దఎత్తున హాజరైన మహిళలు

👉🏼హన్మకొండ, వేయిస్తంబాల గుడి ప్రాంగణంలో కిక్కిరిసిన మహిళలు..

దయాకరరావు కామెంట్స్..

👉🏼తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కు మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది.

👉🏼కాకతీయులు ఏలిన రాజ్యం. ఓరుగల్లు…
ఖిలా వరంగల్ నుండి హన్మకొండ వేయి స్తంభాల దేవాలయానికి చేరుకొని రాణి రుద్రమదేవి ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేసేవారు.

👉🏼బతుకమ్మ పండుగ వరంగల్ లో మొదలు కావడం గర్వకారణంగా ఉంది..

👉🏼బతుకమ్మ పండుగ వరంగల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం వరంగల్ అదృష్టం

శ్రీనివాస్ గౌడ్..కామెంట్స్

👉🏼ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ను ఆంద్ర వాళ్ళు చిన్నచూపు చూసేవారు. బతుకమ్మ పండుగ ద్వారానే తెలంగాణా రాష్టాన్ని సాదించుకున్నాము.

👉🏼బతుకమ్మ పండుగకోసం చేనేత వారు చిరాలను తయారు చేశారు.

👉🏼 మహిళల ద్వారానే రాష్టానికి దీవెనలు రావాలని కోరుకుంటున్నాను.