3మహిళలు, 3 విటులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్ సమీపంలో వ్యభిచారం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. పోలీసుల అదుపులో మహబూబాబాద్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు ఉన్నారని సమాచారం. హన్మకొండ బస్టాండ్ సమీపంలో అన్నపూర్ణ లాడ్జి లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు కావడంతో 3 మహిళలు, 3 విటులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ అర్బన్ క్రైం: హన్మకొండ కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జ్ లో మంగళవారం పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు . లాడ్జిలో చాలా కాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు హన్మకొండ క్రైం SI బొజు రవీందర్ తెలిపారు . SI తెలిపిన ప్రకారం: కొత్త బస్ స్టేషన్ సమీపంలోని లాడ్జిలో చాలాకాలంగా కొందరు మహిళలతో లాడ్డీ నిర్వాహకులే చీకటి కార్యకలాపాలు చేయిస్తున్నట్టు సమాచారం . దీంతో మంగళవారం సిబ్బందితో కలిసి దాడులు చేయడంతో ఇద్దరు విటులు , ముగురు మహిళలతో పాటు ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు . విటులలో మహబూబాబాద్ మండలం పెద్దవంగర మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు . వీరిని హన్మకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు..