భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి

ప్రేమ బంధం హన్మకొండ అబ్బాయిని, ఆస్ట్రేలియా అమ్మాయిని ఒక్కటి చేసింది. ప్రేమకు ఎల్లలు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. హన్మకొండకు చెందిన దినేష్ బాబు ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే డెమీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఇవాళ వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

బంధు మిత్రుల తోపాటు పలువురు విదేశీ అతిథులు కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవంటూ ఈ సందర్భంగా వధువు డెమీ మార్గెరెట్ ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లికి హాజరైన విదేశీ అతిథులు సైతం సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు…