మంత్రి కేటీఆర్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన కేటీఆర్‌ను హన్మకొండ చౌరస్తాలో ఉరితీయాలంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగం పోగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కేసీఆర్, కేటీఆర్ లు మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. కాగా, ఉద్యోగం రావడం లేదన్న బెంగతో కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థి బోడ సునీల్‌నాయక్‌ (28) పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్‌ను మల్లన్న పరామర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంజీఎం నుంచి సునీల్‌ను తక్షణమే కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని మల్లన్న డిమాండ్ చేశారు.