ఇటీవల భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన ‘పుష్ఫ’ ఘటన మరవకముందే తెలంగాణలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులైనా కాకముందే దారుణం జరిగింది. హన్మకొండ జిల్లాలోని దామెర మండలం పసరగొండ గ్రామంలో భార్య అర్చన భర్త రాజు గొంతు కోసింది. అయితే, వీరికి మార్చి 25వ తేదీన వివాహం జరగడం విశేషం. ఇటీవల కుటుంబ కలహాలతో భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఇంతలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు స్వల్ప గాయమవడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

గాయానికి చికిత్స చేయించుకోని రాజు తిరిగి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పెళ్లి అయినప్పటి నుంచి అర్చన విచిత్రంగా ప్రవర్తిసోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఇటీవలే విశాఖపట‍్నంలో పుష్ప అనే యువతి సర్‌ప్రైజ్‌ అంటూ తనకు కాబోయే భర్తను కళ్లుమూసుకోమని కత్తితో గొంతుకోసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.