వరంగల్ గ్రేటర్ పరిధిలో రోడ్ల పై ఉన్న గుంతలు పుడ్చి వేయాలని కోరుతూ ఈ రోజు హన్మకొండ లో కాంగ్రెస్ఆధ్వర్యంలో బస్టాండ్ పరిధిలోని రోడ్లను సందర్శించి పరిస్తితులను చూసి రోడ్లపైనే పువ్వులను చల్లుకుంటూ రోడ్లను పుడ్చి నిరసన వ్యక్తం చేశారు. నగర అధ్యక్షుడుకట్ల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అంటే ఇదేనా లండన్ మాదిరిగా,స్మార్ట్ సిటీ గా చేస్తాను అన్న రోడ్లు ఇలాగే ఉంటాయా అని ప్రశ్నించారు .సంవత్సరానికి 300 కోట్ల నిధులు కార్పొరేషన్ కి ఇస్తానన్న మాట ఎక్కడ పోయిందో గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు. మునిసిపల్ శాఖ మంత్రివర్యులు కే.టీ.ఆర్ ఇచ్చిన మాట నిలుపుకొని గ్రేటర్ వరంగల్ లోని రోడ్లను సక్రమంగా వెయ్యాలని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు,ఈ కార్యక్రమంలో Ex- యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అశం కళ్యాణ్ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సందుపట్ల ధన్ రాజ్ ,నగర ప్రధాన కార్యదర్శి కోడిపాక గణేష్ ,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ వంశీకృష్ణ ,మరియు నాయకులు కె.భరద్వాజ్,రాజ్ కుమార్, హస్సైన్ , అఖిల్ , ముకేష్ , వరప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.