హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , సీపీ వి.రవీందర్, ఎమ్మెల్యేలు రాజయ్య, నన్నపనేని నరేందర్, GWMC కమిషనర్ రవికిరణ్, GWMC మేయర్ గుండా ప్రకాష్ రావు, నిట్ డైరెక్టర్ ఎన్.వి.రమణారావు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

  • జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ సహకరించాలి.
  • రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉండేలా కృషి చేయాలి.
  • జిల్లాపై సీఎం కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది.. అభివృద్ధి పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
  • బాలికలపై జరుగుతున్న సంఘటనలపై రాజకీయాలు తగవు
  • విద్యాసంస్థల్లో చైతన్య కార్యక్రమలు చేపట్టాలి.
  • శ్రీహిత కేసులో సీపీ, కలెక్టర్ గారి కృషి అభినందనీయం
  • కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలను అడ్డుకుంటాం.
  • తప్పుడు ధ్రువపత్రాలతో భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు.
  • అధికారులు ఎవరు సహకరించకూడదు. అలా చేస్తే తరువాత ఇబ్బందులు తప్పవు.