సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ అంజలి. అప్పటికే తమిళనాట స్టార్ హీరోయిన్ గా ఉన్న అంజలి తెలుగులోకి తీసుకురావాలని ఆ చిత్ర బృందం ప్రయత్నించగా తెలుగు అమ్మాయి అయినా అంజలి ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసి ఆ తర్వాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తో ఆమె హిట్ చిత్రాలలో నటించింది కానీ వాటి ద్వారా మరిన్ని పెద్ద అవకాశాలను మాత్రం సంపాదించుకోలేక పోయింది. వచ్చిన అవకాశాలు పెద్దగా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేకపోవడంతో ఆమె తిరిగి తమిళ్ లోనే వరుస సినిమాలు చేయడం ప్రారంభించింది. ఆ మధ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న అంజలి వాటన్నిటి నుంచి తేరుకుని మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో లీడ్ రోడ్ చేసిన నటి అంజలి దీని ద్వారా తనకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తుంది.

అది పక్కన పెడితే ఈ బ్యూటీ జై అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించి పలు చోట్లకు చెట్టపట్టాలేసుకుని తిరగడంతో మీడియా కంట పడింది. దీంతో తప్పని పరిస్థితుల్లో తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం కూడా చేశారు. అలా కలిసి ఉన్న కొద్దీ రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. మళ్లీ అంజలి సినిమాలపై దృష్టి పెట్టింది. సినిమా అవకాశాలు రావడానికి కసరత్తులు చేసి స్లిమ్ గా మారింది అంజలి. అయితే అంజనీ సినీ కెరియర్ లో ఒక స్టార్ హీరో వాడుకొని వదిలేసాడన్న మచ్చ మాత్రం పడిపోయింది. బ్రేకప్ తర్వాత అంజలి గ్లామరస్ రోల్స్ లో కూడా నటించడానికి వెనకాడటలేదు. మునుపటి కన్నా ఇప్పుడు గ్లామర్ డోస్ చాలా పెంచి కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది. తెలుగులో బలుపు, గీతాంజలి, శంకరాభరణం, డిక్టేటర్, చిత్రాంగద, నిశ్శబ్దం లాంటి సినిమాల్లో కూడా అంజలి నటించింది. ఇక ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందట. అలాగే తమిళ్, మలయాళం, కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటిస్తుందని సమాచారం.