రోనా కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత హిందీ సినిమాలు ఒక్కొక్క‌టిగా షూటింగ్ జరుపుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా, వాణీ క‌పూర్ కాంబోలో వ‌స్తున్న సినిమా షూటింగ్ ఛండీగ‌ఢ్‌లో షురూ కావాల్సి ఉంది. అయితే వాణీక‌పూర్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. దీంతో షూటింగ్ మొద‌లు పెట్టాల‌నుకున్న డైరెక్ట‌ర్ అభిషేక్ క‌పూర్ అండ్ టీం డైలామాలో ప‌డ్డ‌ది. కొన్ని ల‌క్షణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయ‌గా వాణీక‌పూర్ కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది.

కానీ అభిషేక్, ఆయుష్మాన్ ఖురానా కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటున్నారు. వాణీ క‌పూర్ తిరిగి కోలుకుంటున్నారు. అయితే ఆమె షూట్ లో జాయిన్ అయే అవ‌కాశాలు లేక‌పోతే ఆయుష్మాన్ ఖురానా సోలో సీన్ల‌ను చిత్రీక‌రించాల‌ని అభిషేక్ క‌పూర్ అనుకుంటున్నాడ‌ట‌. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.