{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582804809469","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582804788403","source":"other","origin":"unknown"}

ప్రముఖ నటి నందితా దాస్ తో తన భర్త రఘుబీర్ అఫైర్ పెట్టుకున్నాడని అతని భార్య పూర్ణిమ ఖర్గా మీడియాకెక్కింది. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ విడాకులు కోరింది. రఘుబీర్, పూర్ణిమలకు 14 ఎల్లా కుమారుడు ఉన్నాడు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ విడిపోయి ఉంటున్నారు. అయితే ఇటీవల పూర్ణిమ విడాకుల కోసం కోర్టుకెక్కారు. తన భర్త గురించి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు.

పెళ్ళైన ఏడేళ్ళకే తమ కాపురంలో సమస్యలు వచ్చాయని, ఓ సీరియల్ కోసం పని చేస్తున్నప్పుడు తన భర్త నందితా దాస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయంలో గొడవలు జరిగేవని, రఘుబీర్ తనకు విడాకులు ఇచ్చి నందితా దాస్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, ఇంట్లో వారికి కూడా నందితా దాస్ ని పరిచయం చేశాడని, కానీ ఆ తర్వాత నందితా… రఘుబీర్ ని వదిలేసింది అని చెప్పారు.

రఘుబీర్ తో ఏ అమ్మాయి కలసి ఉండలేదని నందితాకు చాలామంది చెప్పారని విషయాన్నీ పూర్ణిమ వెల్లడించారు. ఆ తర్వాత రఘుబీర్ నటుడు సంజయ్ మిశ్రా భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆమె గర్భం కూడా దాల్చిందని, అలాంటి వ్యక్తితో ఎలా కలసి ఉండగలనని పూర్ణిమ ఆవేదన వాయ్కతం చేసింది. తన భర్త నుంచి విడాకులు కావాలని, తన బిడ్డను చూసుకోవడానికి రఘుబీర్ పది కోట్ల భరణం చెల్లించాలని ఆమె కోరింది.