తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌ ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ మంగళవారం ఆమె తిరుచ్చికి వెళ్ళి అక్కడ ఎంఏఎం కళాశాలలో పరీక్షలు రాసింది.విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( ఎఫ్‌ఎంజీఈ)పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో తిరుచిలోని ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు. అదే కళాశాలకు పరీక్షలు రాయడానికి వచ్చిన ఇతర విద్యార్థులు అక్కడ సాయిపల్లవిని చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం ఆమెతో కలిసి ఫోటో దిగడానికి, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. ఇకపోతే ఆమె అక్కడి విద్యార్థులతో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి.