{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581776362634","total_editor_time":6,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581776251438","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

హీరో నితిన్ త్వరలో వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో శాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కాగా శనివారం హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలొ ‘పసుపు కుంకుమ’ కార్యక్రమం జరిగింది.

దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ “పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి” అని పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న పెళ్లి జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భీష్మ’ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.

నితిన్ కి పెళ్లి అవ్వుతుండడంతో అభిమానులతో పాటు సినీ తారలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ”అభినందనలు నితిన్ సార్!! చూశారా, నేనొచ్చిన వేళా విశేషం మీరు పెళ్లిచేసుకోబోతున్నారు. ఇదంతా సరదాకే. మీ ఇద్దరిని ఇలా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం నితిన్, రష్మిక కలిసి ‘భీష్మ’ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నారు.