టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన లివర్ సమస్యతో భాదపడుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాగా శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రమేష్ బాబు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్టు తెలుస్తోంది. రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు. రమేష్ బాబు బాల నటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో పరిచయం అయ్యారు.

ఆ తర్వాత రమేష్ బాబు, కృష్ణ నటించిన పలు సినిమాల్లో హీరో చిన్ననాటి వేశాల్లో నటించారు. ముఖ్యంగా “మనుషులు చేసిన దొంగలు”, “దొంగలకు దొంగ,” “అన్నాదమ్ముల సవాల్” వంటి చిత్రాల్లో చిన్పప్పటి హీరో పాత్రల్లో నటించారు రమేష్ బాబు.హీరో మహేశ్‌ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. మహేశ్‌ బాబు సోదరుడు రమేష్ బాబు(56) శనివారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. రమేశ్‌ బాబు మరణ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని లోనవుతున్నారు. రమేశ్‌ బాబు మరణ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని లోనవుతున్నారు.