కరీంనగర్: దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్‌ లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది.ఇందులో భాగంగా హుజురాబాద్‌లో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.

ఇప్పటికే తొలి విడతలో రూ.500 కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతలో రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల కానుంది.