హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌లో దారుణం చోటుచేసుకున్నది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యా, బిడ్డలను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌ పట్టణ శివారులోని, మధు టాకీస్ ప్రాంతంలో తన కుటుంబంతో నివాసముంటున్నాడు. కూతురుకి వివాహం అయినప్పటికీ ఆమె పుట్టింట్లోనే ఉంటున్నది. అయితే గత కొంతకాలంగా కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇవాళ ఉదయం భార్య రమ (45), కూతురు ఆమని (25) తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్యచేశాడు. అనంతరం హుజూరాబాద్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వెంకటేశ్‌ కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు. కాగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.