హుజురాబాద్: కరోనా కట్టడిలో భాగంగా హుజురాబాద్ లో ఈరోజు నుంచి 14 రోజులు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పురపాలక ఛైర్ పర్సన్ గందె రాధిక ప్రకటించారు. కరోనా తీవ్రత దష్ట్యా ప్రజల ఆకాంక్ష, పాలకవర్గ సభ్యుల సూచన మేరకు ఆగస్టు 7వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు.