హుజూరాబాద్: బిజెపి ప్రచారం వాహనం గొర్రెలపైకి దూసుకెళ్లిన సంఘటన హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో జరిగింది. 230 గొర్రెలు రోడ్డు పైన వెళ్తుండగా వాటిపై బిజెపి ప్రచార వాహనం తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు ఘటనా స్థలంలో మృతి చెందాయి. ఈ ఘటనలో గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన గొర్రెలు కంపా రాములు, అమ్మ రాజయ్య, కంపా సంతోష్‌మని కోర్కల్ గ్రామస్థులు తెలిపారు. ఎస్‌ఐ కిరణ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.