హుస్సేన్ సాగర్‌లోకి దూకిన యువతి! కాపాడిన పోలీసులు

ఏఎస్ రావు నగర్ కు చెందిన ఓ మహిళ ఇవాళ ఉదయం హుస్సేన్ సాగర్‌లో దూకింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న లేక్ పోలీసులు ఆమెను కాపాడారు. లేక్ పోలీసు కామేశ్వర్‌రావు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళ భర్తకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తతో వివాదం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైం

హుస్సేన్ సాగర్‌లో శనివారం ఉదయం 8 గంటలకు గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. యువతి వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని రామ్‌గోపాల్‌పేట ఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపారు. ఈ యువతికి సంబంధించిన వారు రామ్‌గోపాల్‌పేట పోలీసులకు ఆశ్రయించొచ్చు అని సూచించారు. 9951563904 నంబర్‌కు కాల్ చేయొచ్చని ఎస్‌ఐ తెలిపారు…