{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1629168872983","source":"other","origin":"gallery"}

హైదరాబాద్: ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం: కరీంనగర్ జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన మౌనిక యూనివర్సిటీలో ఎం.టెక్ నానో సైన్స్ రెండో ఏడాది చేస్తోంది. యూనివర్సిటీ హోస్టల్ ఎల్‌హెచ్ 7లో ఉంటున్న మౌనిక సాయంత్రం తన రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కరణమని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.