ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయంతో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో విడిపోయేందుకు సిద్ధమయ్యారు, కొన్నాళ్లు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా అబార్షన్‌ చేయించాడు పెండ్లి చేసుకోవాలని నిలదీయగా మొఖం చాటేశాడు, మోసపోయానని గుర్తించిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్యకు ముందు తనను మోసం చేసిన వ్యక్తిని వదిలిపెట్టవద్దంటూ సెల్ఫీ వీడియో తీసింది. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం: సూర్యాపేట జిల్లాకు చెందిన దుగ్యాల ఐశ్వర్య(20) డిగ్రీ చదివి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఓ ప్రైవేటు సంస్థలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంది. ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మారెడ్డి అషేర్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది ఫిబ్రవరి 20న సంఘీ టెంపుల్‌లో ఐశ్వర్యను పెండ్లి చేసుకున్నాడు. అయితే కులాలు వేరుకావడంతో పాటు అషేర్‌ అవారాగా తిరుగుతుండటంతో ఐశ్యర్య కుటుంబ సభ్యులు పెండ్లిని అంగీకరించలేదు. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడటంతో వారిద్దరూ విడిపోయేందుకు అంగీకరించారు. అప్పటి నుంచి ఐశ్వర్య హాస్టల్‌లో ఉంటోంది. కొన్నాళ్లపాటు దూరంగా ఉన్న అషేర్‌ ఇటీవల తిరిగి ఐశ్వర్యకు దగ్గరయ్యాడు. తన కుటుంబ సభ్యులను ఒప్పించి పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో తరుచూ కలుసుకున్నా రు. మూడునెలల క్రితం ఐశ్వర్య గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. కాగా, ఇటీవల అషేర్‌ సోదరికి వివాహం కాగా ఆమె నెలతప్పింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఐశ్వర్య తనకు అబార్షన్‌ చేయించి అన్యాయం చేశావంటూ అషేర్‌తో గొడవకు దిగడంతో పాటు పెండ్లి విషయమై నిలదీసిం ది. దాంతో తల్లితో మాట్లాడి చెబుతానంటూ ఇంటికి వెళ్లిన అషేర్‌ ముఖం చాటేశాడు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన ఐశ్వర్య బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో తాను నివాసం ఉంటు న్న హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు తీసుకున్న ఐశ్వర్య తనను మోసం చేసిన అషేర్‌ను వదిలిపెట్టవద్దని, తన చావుకు కారణం అతడు చేసిన మోసమే అని చెప్పింది. దీంతో పాటు తనను క్షమించాలని, చెప్పిన మాట వినకుండా ప్రేమ పేరుతో మోసపోయానంటూ తండ్రికి కూడా ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.