గాంధీ అత్యాచార సంఘటనపై పోలీసులు పురోగతిని సాధించారు ఘటనకు కారణమని భావిస్తూ నలుగురు ఆసుపత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వారిలో ఒక టెక్నిషియన్‌, ఒకరు సెక్యూరిటి సిబ్బందితో పాటు మరో ఇద్దరు ఇతరులను కూడ అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీ అసుపత్రి అత్యాచార సంఘటనపై విచారణను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంఘటన జరిగిన స్థలంలో కనిపించిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బాధితురాలి సోదరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గాంధీలో అత్యాచారం జరిగిందని బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చికిత్స కోసం గాంధీలో చేరారు, అయితే ఆయనకు అటెండెంట్‌గా భార్యతోపాటు ఆయన మరదలు కూడా వచ్చారు. అయితే వారిని ల్యాబ్‌టెక్నిషియన్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్‌కు దూరపు బంధువులు కావడంతో మాట్లాడేవారని, దీంతో వారికి కల్లులో మత్తుమందు ఇచ్చి తాగించిన తర్వాత ఓ గదికి తీసుకువెళ్లి సాముహిక అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

కాగా అదే కాకుండా రెండవ రోజు కూడా ఆసుపత్రిలోని సెల్లార్‌లోకి తీసుకువెళ్లి బలవంతం చేశారని, అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు బయట ఎవరికి చెప్పినా చంపుతామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం మీద సంఘటనపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి బాధితురాలి సోదరి అడ్రస్ తెలియకపోగా అచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఆసుపత్రి సూపరిండెంట్ సైతం గాంధీ సంఘటనపై స్పందించారు. నిజాలు తెలిసేవరకు ఎలాంటీ పుకార్లు చేయవద్దని ఆయన విజ్ఝప్తి చేశారు. దర్యాప్తు జరుగుతుందని అందులో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.