మాదాపూర్‌: మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ(34)పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌ సిఐ రవీంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం: హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పాత ఔట్‌పోస్టు వద్ద సోమవారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం రాత్రి ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రమైన గాయాలుండడంతో రాయితో బలంగా కొట్టినట్లుగా భావిస్తున్నారు.

సంఘటనా స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మహిళకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈఘటనకు సంబంధించి అనుమానితులైన కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.