శేరిలింగంపల్లి: వరకట్న వేధింపులకు మరో ఆడబిడ్డ బలయ్యింది. ఈ సంఘ‌ట‌న మియాపూర్ పోలీస్‌ స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివ‌రాల ప్రకారం: మియాపూర్ ఎస్‌ఎం‌ఆర్ మెట్రో పోలీస్‌‌లో నివాస‌ముండే పావ‌ని(22)కి కొంత‌కాలం క్రితం ఆదిలాబాద్‌‌కు చెందిన శ్రవ‌ణ్ అనే వ్యక్తితో వివాహం జ‌రిగింది. వివాహం అనంత‌రం పావ‌ని భ‌ర్త శ్రవ‌ణ్‌ ఆడ‌ప‌డుచు శ‌కుంత‌ల‌, హిమవంత్ రెడ్డిల‌తో క‌లిసి తరచూ వ‌ర‌క‌ట్నం కోసం వేధింపుల‌కు గురి చేస్తున్నట్లు పావ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల ఆ వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక ఆదివారం పావని ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. విషయం తెలిసిన మియాపూర్ ఏసీపీ సంఘ‌ట‌నా స్థలాన్ని పరిశీలించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప్రతికి త‌ర‌లించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.