రోజు రోజుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా అడ్డదారుల్లో సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం వేసిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అశ్లీల వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి నిత్యం వేల సంఖ్యలో యువత చదువుకోవడానికి లేదా పని చేసి డబ్బులు సంపాదించడానికి వస్తుంటారు.

ఈ క్రమంలో కొందరు ముఠా సభ్యులు వారికి కాల్ బాయ్ ఉద్యోగాలు తమ దగ్గర ఉన్నాయంటూ కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తమ దగ్గర వైవాహిక జీవితంలో నిరుత్సాహ పడిన ఆంటీలు మరియు అమ్మాయిలు, అన్ని వయసుల వారు తమ దగ్గర ఉన్నారంటూ ఈ ప్రకటనలో సమాచారం ఉంచుతున్నారు. అంతేగాక వీళ్ళని సుఖపెడితే రోజుకు లక్ష రూపాయలు ఇస్తాం అంటూ వల పన్నుతున్నారు. అయితే ఇందుకుగాను అభ్యర్థులు చేయాల్సిందల్లా, రెండు వేల రూపాయలు తమ అకౌంట్లో జమ చేసి, తదుపరి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయమని చెబుతారు.

ఇలా ప్రస్తుతం నగరంలో కొంతమంది డబ్బు ఆశ ఎరగా వేసి అమాయకపు యువతను మోసం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు కూడా ఇదే తరహాలో మోసపోయి హైదరాబాదు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇలాంటి తరహా ప్రకటనలపై నిఘా ఉంచి సైబర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నాలు చేస్తున్నారు.