హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అర్థరాత్రి దారుణం జరిగింది. ఫేస్ బుక్ పరిచయం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల ప్రకారం: విజయ్ సింహా అనే వ్యక్తికి ఫేస్ బుక్‌లో ఓ మహిళ పరిచయం అయ్యింది. దీంతో అతడు తరుచు ఆ మహిళతో వీడియో కాల్స్ మాట్లాడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో విజయ్ సింహాకు ఆ మహిళపై ఇష్టం పెరిగింది. దీంతో, భర్తను వదిలేసి తనతో రావాలని ఆ మహిళను విజయ్ సింహా వేధించాడు. దీనికి మహిళ నిరాకరించడంతో ఆగ్రహాంతో రగిలిపోయాడు.

తన మాట వినడం లేదని కోపంతో మహిళ ఇంటికి వెళ్లి దారుణంగా దాడి చేశాడు. బీర్ బాటిల్ పగులగొట్టి గొంతు కోసి, చేయి విరగ్గొట్టి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధిత మహిళను తన భర్త ఆసుపత్రికి తరలించాడు. నిందితుడు విజయ్ సింహాతో తమకు ప్రాణహాని ఉందని బాధితురాలి భర్త వాపోతున్నాడు. కాగా, నిందితుడి విజయ్ సింహా గతంలో ఓ రాజకీయ నాయకుడి దగ్గర పీఏగా పనిచేసినట్లు సమాచారం.