నెక్కొండ (వరంగల్) : సాయిరెడ్డిపల్లిలో ఒకరికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు నెక్కొండ ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్‌ రమేశ్‌ గురువారం తెలిపారు. సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మార్టులో పనిచేస్తుంటాడని, షాపులో ఉన్న వారందరికి కరోనా పరీక్షలు జరపగా అతనికి పాజిటీవ్‌ వచ్చినట్లు తమకు సమాచారం అందించారని చెప్పారు. హైదరాబాద్‌లో పరీక్షను నిర్వహించగా, రిపోర్టు రాకముందే గ్రామానికి వచ్చినట్టు తెలిపారు. కాగా అతను నెక్కొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రెండు రోజుల క్రితం వచ్చిన సమాచారం ఉండటంతో సదరు ఆస్పత్రిని 14 రోజులు తెరవవద్దని, డాక్టర్‌ను హోంక్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో సీఐ తిరుమల్‌, తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, ఎస్సై నాగరాజు, పాల్గొన్నారు.