హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మల్కాజిగిరి పీఎస్ పరిధిలో వీధుల్లో భిక్షాటన చేస్తూ బతికే 60ఏళ్ల యాచకురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

మల్కాజిగిరి పీఎస్ పరిధిలో వీధుల్లో భిక్షాటన చేస్తూ బతికే, వీధుల్లో అడుక్కు తినే 60ఏళ్ల వృద్ధురాలిని ఇద్దరు వ్యక్తులు మాటల్లో పెట్టారు. తమతో పాటు ఇంటికి తీసుకెళ్లారు. ఆమె చేత మద్యం తాగించి అనంతరం గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మల్కాజిగిరికి చెందిన 50ఏళ్ల వయస్సున్న చిన్నప్ప, 53 ఏళ్ల వయస్సున్న నేనావత్ విజయ్కుమార్..

ఈనెల 17న అర్థరాత్రి ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ సమయంలో రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలిపై వారి కన్ను పడింది. దీంతో నెమ్మదిగా ఆమెను మాటల్లో దించారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకు మద్యం తాగించారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే నిందితులు ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారు. అయితే ఇద్దర్నీ మిర్యాలగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.