సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణి బాత్రూంలోకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో ఖంగారుపడిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె ఊరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమెను కిందకు దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గత ఎనిమిదేళ్లగా ఆమె పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌తో పాటూ మరికొన్నిటిలో శ్రావణి నటిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణికి దగ్గరయ్యాడు అతను.. అయితే కొద్దిరోజులుగా ఆమెను వేధించడం ప్రారంభించాడు..

దీంతో మనస్థాపం చెందిన శ్రావణి ఆత్మహత్యకు చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రావణి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రావణికి దేవరాజు రెడ్డి టిక్ టాక్‌లో పరిచయం అయినట్టు తెలుస్తోంది. ఈ పరిచయం తరువాత టిక్ టాక్ విదేవులతోనే వారిద్దరు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం దేవరాజు రెడ్డి అందుబాటులో లేడు.. అతనిని విచారించడం కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు డిమాండ్ చేశారు.