హైదరాబాద్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. రాజేంద్ నగర్‌లో ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్‌ను అద్దెకు తీసుకొని కొందరు సీక్రేట్‌గా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ , ముంబైల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి ఈ దందా నడుపుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆరుగురు యువతుల్ని, ముగ్గురు విటుల్ని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ ఫోన్లు, రూ. 28 వేల నగదు, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న… నిర్వహిస్తూ, మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌ అనే వ్యక్తులు 2016లోనే పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని జైలుకు పంపగా, బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఇదే బిజినెస్ మొదలు పెట్టారు.

తాజాగా పట్టుబడిన వీరు: ట్రిపుల్ బెడ్ రూంను రెండు వారాల కిందటే అద్దెకు తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ముంబై నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ఒకరు, నగరం నుంచి ఒక యువతిని ఇక్కడకు తీసుకుని వచ్చారన్నారు. వారికి నెలకు రూ. 25 వేలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. పాతబస్తీకి చెందిన ఇమ్రాన్‌ షరీఫ్‌ అనే యువకుడు వీరి వద్దకు విటులను పంపుతుంటాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇంకా ఎక్కడెక్కడా ఈ దందా నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు…