ఇంటి నుంచి బయలుదేరిన గంటల వ్యవధిలోనే వారంతా దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై బోరువెల్‌ వాహనం – కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితులు హైదరాబాద్‌ తాడ్‌బండ్‌ వాసులుగా గుర్తించారు. వీరంతా తాడ్‌బండ్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మృతుల వివరాలు : అసీఫ్‌ ఖాన్‌(50), సానియా (18), నజియాబేగం(43), హర్ష (28), నజియాభాను (36), హర్ష భాను(6), క్షతగాత్రులు: కరీనా బేగం, అయూమ్‌ఖాన్‌, నిజార్‌బేగ్‌, అన్వర్‌ ఖాన్‌, ఖలీద్