భార్య అక్రమ సంబంధాన్ని ఓ ఎన్‌ఆర్‌ఐ భర్త గుట్టురట్టు చేశాడు. హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఉంటున్న ఓ డాక్టర్‌తో ఎన్‌ఆర్‌ఐ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో నిఘా పెట్టిన ఎన్‌ఆర్‌ఐ సంతోష్‌ రెడ్డి ఇద్దర్నీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాడు. సంతోష్‌ రెడ్డికి 2010లో సూర్యపేట జిల్లాకు చెందిన యువతితో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం చైతన్యపురిలోని వాసవి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. సంతోష్‌ రెడ్డి ఉన్నత విద్య కోసం తరచూ ఆస్ట్రేలియా వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన భార్య డాక్టర్‌ శివ ప్రసాద్‌తో పరిచయం పెంచుకుంది…

భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో సంతోష్‌ రెడ్డి పలు మార్లు హెచ్చరించాడు. వారి కుటుంబ సభ్యులకు చెప్పినా ఆమెలో మార్పు కనిపించలేదు. దీంతో ఆమెపై భర్త సంతోష్‌ రెడ్డి నిఘా పెట్టాడు. శుక్రవారం రాత్రి శివప్రసాద్‌, సంతోష్ రెడ్డి భార్య ఒకే దగ్గర ఉన్నారని సమాచారం అందడంతో పోలీస్‌కు ఫోన్‌ చేసి అక్కడికి రప్పించి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఎన్‌ఆర్‌ఐ భార్య-శివ ప్రసాద్‌లతో పాటు అదే సమయానికి పోలీసులకు మరో ట్విస్ట్ తగిలింది: పోలీసులు పక్క ఇంట్లో ఎవరుంటున్నారని అడిగారు. వాళ్లకేదో డౌట్ వచ్చి అలా అడిగారు. ఎన్నారై భర్త ఎవరో ఉంటున్నారని తెలిసీ, తెలియని సమాధానం చెప్పారు.

పోలీసులు వెంటనే ఆ ఇంటి తలుపులు కొట్టారు. లోపల నుంచీ ఓ జంట కంగారుపడుతూ బయటికి వచ్చారు. మీరు భార్యాభర్తలా అని పోలీసులు అడిగితే బిక్కమొహాలు పెట్టారు. ఏంటి విషయం చెప్పండి అంటే తాము భార్యాభర్తలం కాదనీ తమది వివాహేతర సంబంధం అనీ తెలిపారు. పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇక్కడా ఇదే కథా అని సెటైర్ వేశారు. వాళ్లిద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండకు తరలించారు పోలీసులు. ఐతే ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పును అమల్లోకి తీసుకుంటే వివాహేతర సంబంధాలు నేరం కాదు. అందువల్ల ఈ కేసుల్లో పోలీసులు ఎలా ముందుకెళ్తారో తేలాల్సిన అంశం.