హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లై ఒక్క రోజు కూడా పూర్తవ్వకముందే వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వారిని వెక్కిరించింది. వివాహమైన 24 గంటలకే కారు యాక్సిడెంట్‌లో పెళ్లి కుమారుడు చనిపోగా తీవ్ర గాయాలపాలైన నవవధువు కోమాలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే: మృతుడు శ్రీనివాస్‌ వివాహం మంగళవారం తిరుపతిలో జరిగింది. అనంతరం నూతన దంపతులు చెన్నైలోని అత్తగారింటికి కారులో వెళ్తున్నారు.

ఈ క్రమంలో బెంగళూరు సమీపంలో నవ దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో శ్రీనివాస్‌ మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన పెళ్లి కుమార్తె కోమాలోకి వెళ్లిపోయింది. నూరేళ్లు పచ్చగా సాగాల్సిన వైవాహిక జీవితం 24 గంటల వ్యవధిలో ఇలా విషాదంతం కావాడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు.