వనస్థలిపురం: అమ్మాయిలతో తన భర్త చేస్తున్న రాసలీలలను తట్టుకోలేక ఓ భార్య పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్తను, లాడ్జి నిర్వాహకులను పోలీసులకు పట్టించింది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ శివారులోని ఓ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్‌గా ఉన్న అనిల్ వనస్థలిపురంలోని ఓ లాడ్జిలో అమ్మాయిలతో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అనిల్ భార్య పోలీసులకు ఫోన్ చేసింది.

వనస్థలిపురంలో ఉన్న లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ లాడ్జి మీద రైడింగ్ చేశారు. ఆ సమయంలో లాడ్జిలో ముగ్గురు అమ్మాయిలు, లాడ్జి ఓనర్ కూడా ఉన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమానితో కలసి అమ్మాయిలతో అనిల్ ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు గ్రహించారు.