హైదరాబాద్‌: దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్‌ హైబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. గత పది రోజులుగా రజనీకాంత్‌ నగరంలోనే ఉంటున్నారు. అయితే చిత్ర యూనిట్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో ముందు జాగ్రత‍్త చర్యగా రజనీకాంత్‌ కూడా మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఈ నెల 22వ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌ అని వచ్చింది. మరోవైపు రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. అధిక రక్తపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని, ఆయనకు ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.