హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ సంబంధంతో ఓ యువకుడి బలయ్యాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్‌ను ఇంటికి పిలిపించుకుంది.

అదే సమయంలో భర్త మొయినుద్దీన్ ఇంటికి వచ్చాడు. భార్య నేహా, ప్రియుడు సోయల్ గదిలో ఉండడం చూసి నిలదీయడంతో నేహా ప్లేట్ ఫిరాయించింది. సోయల్ తనను బలవంతం చేయబోయాడని చెప్పింది. అనంతరం భార్యా భర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత ఇరువురూ నాచారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.