గత దశాబ్దంలో నమోదైన క్రైమ్ కేసుల్లో మనుషులు శారీరక అక్రమ సంబంధాల విషయంలో నమోదవుతున్న కేసుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ప్రతిరోజూ శృంగార మోజులో తేడాలొచ్చిన కేసులు నిత్యం కనిపిస్తున్నాయి. ఎప్పటికపుడు వినూత్నమైన కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాదులో నమోదైన తాజా కేసులో బాధితురాలి వయసు 32. నిందితుడి వయసు 19. ఆ యువకుడు ప్రేమిస్తానని వెంటపడ్డాడట. అరె అంత గ్యాప్ ఉంది పిల్లాడి ఇంట్లోవారు ఎదురుతిరుగుతారేమో అన్న అనుమానం కూడా లేకుండా అతను చేష్టలకు మురిసిపోయింది. పెళ్లి చేసుకుంటాను అంటే సంబర పడింది. ఇపుడు తప్పించుకు తిరుగుతున్నాడంటూ కేసు పెట్టింది.

హైదరాబాద్‌ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట సమీపంలో ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువకుడు 32 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా మహిళ వెంటపడ్డ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. పెళ్లి చేసుకుంటానని ఆ మహిళను నమ్మించాడు. యువకుడి మాటలను ఆ మహిళ నమ్మడంతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెకు కనిపించకుండా తిరగడం మొదలుపెట్టాడు. ఎన్ని రోజుల గడిచినా. అతడు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.