హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈసీఐఎల్ వద్ద మసాజ్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. ఏఎస్‌రావు నగర్‌లోని కేఎల్ఎం షాపింగ్ మాల్ సమీపంలో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న గ్లోవిష్‌ మసాజ్‌ సెంటర్‌లో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

మంగళవారం రాత్రి కస్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపగా వాస్తవాలు వెలుగు లోకి వచ్చాయి. మసాజ్ సెంటర్ ముసుగులో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. పోలీసులు పంపిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆ ఇంటిపై వెంటనే దాడి చేసి నిర్వాహాకుడు మహేష్, అస్సాంకు చెందిన మహిళను మరో నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.