హైదరాబాద్: భార్య, భర్త అన్న తర్వాత గొడవలు జరగడం సర్వసాధారణం. ఇక భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు వారి దాంపత్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి అంటూ చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం, చిన్న గొడవలతో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న చిన్న కారణాలతోనే మనస్థాపం చెంది, చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని, ఆత్మహత్యలు పేరుతో అర్ధాంతరంగానే ముగిస్తున్నారు ఎంతోమంది.

ఇక్కడ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది, భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఏకంగా ఒకరి ప్రాణం తీసింది. భార్య తో తలెత్తిన వివాదానికి మనస్తాపానికి గురైన భర్త చివరికి ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా భార్య షాక్ అయ్యింది . ఈ విషాదకర ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నర్సింగ్ నగరానికి చెందిన హర్షిని ఆమె భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగులు.

హైదరాబాద్ నగరంలోని హైదర్ షాకోట్ లో నివసిస్తున్నారు ఇద్దరు. అయితే వీరికి గత యేడాది వివాహం జరిగింది. ఇద్దరు కూడా ఎంతో సంతోషంగానే ఉన్నారు. ఇక భార్యాభర్తల అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు జరగడం మామూలే. వీరి మధ్య కూడా ఇలాంటి గొడవ జరిగింది. ఇద్దరు వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్న తరుణంలో రాత్రి సమయంలో వండుకోవాల్సిన కూర విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఒకరినొకరు మాట మాట అనుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఎంతకీ తలుపు తీయలేదు చివరికి ఉరి వేసుకుని విగతజీవిగా మారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.